నా రాతలు

మే 31, 2006

మహా ప్రస్థానం- శ్రీ శ్రీ

ప్రచురించిన వర్గము శ్రీ శ్రీ — by గుడుంబా శంకర్ (రాజు) @ 7:21 పూర్వాహ్నం

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదంత రాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచం జలపాతం?

దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోట లన్నిటిని దాటండి!
నదీ నదాలు,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!

ఎముకుల కుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!

మరో ప్రపంచం,
మహా ప్రపంచం
దరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడ లేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని?

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరుపులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సల సల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె,
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండీ ముందుకు!
పదండీ త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!

త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగ భుగలు ?

శ్రీ శ్రీ – ఏప్రిల్ 12, 1994
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం

అభిప్రాయములు »

  1. ee sathabdham kavithvaniki sambandhinchi sri sri garidhi sri srini maruvaleru janam sri sri anna pere telugu vadi balam

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా pradeep chilukuri — ఏప్రియల్ 19, 2009 @ 2:27 అపరాహ్నం |జవాబు

  2. sri sri ne maruvaleru janam sri sri anna pere telugu vadi balam

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా pradeep chilukuri — ఏప్రియల్ 19, 2009 @ 2:29 అపరాహ్నం |జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది