నా రాతలు

జూన్ 24, 2006

ప్రేమ

ప్రచురించిన వర్గము చలం — by గుడుంబా శంకర్ (రాజు) @ 3:11 అపరాహ్నం

శరీర వాంఛ తీర్చుకోవడంతో తృప్తి పడక, నిరంతరమూ ఉన్నతమైన రొమాన్స్ కోసం వెతికే నా హృదయాన్ని చూస్తే నాకు గర్వం. ఈ రుతువుల ఆలింగనానికి కంపించి తపించే ఈ శరీరాన్ని, వీణతంత్రుల కన్న గొప్పగా రమ్యంగా కంపించగల ఈ నరాల్ని చూస్తే గర్వం నాకు.

నేను కావలించుకున్న స్త్రీని నమ్రతతో, కృతజ్ఞతతో పూజిస్తే గాని శాంతించని నా హృదయాన్ని చూస్తే నాకు గర్వంగా, నా స్వభావమే, నా నరాలే, నా హృదయమే, నన్ను కాల్చి బొగ్గు చేస్తాయా, కానీ.ధన్యమౌతుంది నా జీవితం.

ఉన్నతమైనదీ, జీవితాన్నంతా కోరేదీ; మనిషినే, ఆలోచనల్నే, జీవితాల్నే మార్చేసే అధ్భుతమైన ప్రేమని చూస్తే ప్రపంచానికి ఇష్టం లేదు.తాత్కాలికంగా పర స్త్రీలతో సంభందం పురుషుడికి కలిగితే సంఘం tolerate  చేస్తుంది.హర్షిస్తుంది.

అదే గాడమై, అసత్యాన్ని, మోహాన్ని కాల్చగలిగినంత నిర్మలమయిందా, సంఘం శిక్షించి, బలి తీసుకుంటుంది.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

చలం వ్రాసిన 'ప్రేమ లేఖలు' (1922) నుంచి సంగ్రహితం.

నిజంగా మొదటి రెండు పేరాలు చదివినప్పుడల్లా నాకు అనిపిస్తూంటుంది- ఆ రెండు పేరాలు నన్ను,నా ఆలోచనల్ని అద్దం పట్టి చూపిస్తాయి. కాని ఏమి లాభం…చలం ముందు గానే చెప్పినట్టు..సంఘం నన్ను వెలి వేసి శిక్షిస్తూ ఉంది.

జూన్ 17, 2006

రుద్ర వీణ - ఇళయ రాజా

ప్రచురించిన వర్గము తెలుగు పాటలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 12:36 అపరాహ్నం

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందాఁ.. సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కదాఁ. గుండెబలం తెలిసేది
దుఃఖానికి తలవంచిటే తెలివికింక విలువేది

మంచైనా..చెఢ్ఢైనా పంచుకోను నేలేనాఁ.
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానాఁ..
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి..

చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది
గుండెల్లో సుడులు తిరిగే కలత కధలూఁ..

చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!!

కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అనిఁ
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకినీఁ..
కోకిలల కుటుంబంలో చెఢబుట్టిన కాకిని అనిఁ..
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకినిఁ..

చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంటు విప్పాలని ఉంది !!

పాట బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచిపొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం..విరబూసే ఆనందం
తేటి తేనె పాట..పంచ వన్నెల విరి తోట
బ్రతుకు పుస్తకం లో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటాఁ…
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటాఁ…

చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!

ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మిగతా కాలాలకు మరి కాలం?

నిట్టూర్పుల వడగాల్పుల శృతిలో ఒకడూ
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచి వంచను మోడై గోడు పెట్టువాడొకడు

వీరి గొంతులో కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్త కోకిలా
కళ్ళు ఉన్న కబోదిలా..చెవులు ఉన్న బదిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడా..కరువాయెను నా స్థానం

చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !
చెప్పాలని ఉంది..గొంతు విప్పాలని ఉంది !!

అసహాయతలో దడ దడలాడే హృదయ మృదంగ ద్వానం
నాడుల నడకల టడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాదల బిడారూ
దిక్కూ మొక్కూ తెలియని దీనుల యదార్ధ జీవన స్వరాలూ
నిలువునా నన్ను కమ్ముతున్నాయి..
శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి..ఈ అపశృతి సరిచెయ్యాలి

జనగీతిని వద్దనుకుంటూ..నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను..కలవరింత కోరను నేనూ

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతానూ
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తానూ
నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తానూ
నేను సైతం .. నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేనూ
నేను సైతం .. నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేనూ

సకల జగతికి శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనం లో నందనం వికసించు దాకా
పాత పాటను పాడలేనూ..కొత్త బాటను వీడి పోనూ
పాత పాటను పాడలేనూ..కొత్త బాటను వీడి పోనూ
నేను సైతం .. నేను సైతం.. నేను సైతం .. నేను సైతం
నేను సైతం .. నేను సైతం.. నేను సైతం .. నేను సైతం

మహర్షి - ఇళయరాజా

ప్రచురించిన వర్గము తెలుగు పాటలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 12:12 అపరాహ్నం

సాహసం నా పదం..
రాజసం నా రధం..
సాగితే ఆపటం సఖ్యమాఁ…?

పౌరుషం ఆయుధం…
పోరులో జీవితం..

కానిదేముందిఁ… నేఁ… కోరుకుంటేఁ..
పూని సాదించుకోనాఁ?…
లాభమేముంది…కలకాలముంటేఁ…
కామితం తీరకుండా…

కష్టమోఁ..నష్టమోఁ…
లెక్కలే వేయనూఁ…

బీరువల్లే పారిపోనుఁ…
రేయి వళ్ళో జారి పోనుఁ…

నే మొదలు పెడితేఁ…ఏ సమరమైనా..
ఈ చిటిక కొడుతూఁ… నే గెలవనాఁ..

జూన్ 6, 2006

గోదావరి…

ప్రచురించిన వర్గము చిత్ర సమీక్షలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 3:53 అపరాహ్నం

శేఖర్ కమ్ముల: నిజంగా గురువు గారు అమ్మాయిల గురించి బాగా స్టడీ చేశినట్లు న్నారు. లేకపోతే ఈ కాలం అమ్మయిల గురించి ఈ మధ్య కాలంలో అంత చక్కగా,కరెక్ట్గా ఎవరూ తెరకెక్కించలేదు.(ఆనంద్ అండ్ గోదావరి…రెండు సినిమాల లోను).పాత్రల మద్య సంఘ్రషణ కాకుండా, పాత్రల మనస్త్వత్వాల మధ్య సంఘర్షణ ని చూపించటంలో శేఖర్ స్క్రీన్-ప్లే నిజంగా అధ్బుతం

శ్రీ రాం:
ఈ తరానికి, పోటీ బ్రతుకు లకి, నిశ్చల నిశ్చితాలకి అందని , అర్ధం కాని…ఉన్నతమైన వ్యక్తిత్వం..ఉన్న పాత్రలో సుమంత్ నిజంగా సరి పోయాడు. నాకే అలా అనిపిస్తోందో..లేకపోతే నిజంగా నిజమేనేమో… ఆ పాత్రకి సుమంత్ తప్ప ఎవరూ నప్పరేమో అనిపిస్తూంది. ఒక వైపు మరదలి ప్రేమ కోసం ఆరాటం..మరొక వైపు సామాజిక స్పృహ ని ఒకే పాత్రలో పోషించిన సుమంత్ నిజంగా అభినందనీయుడు.

సీత: ఈ పాత్ర గురించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎందుకంటే..సీత ప్రతి సినిమాలో పాటల కోసం..గ్లామర్ కోసం కనిపించే మామూలు హీరోయిన్ కాదు. నేటి తరం అమ్మాయిలకి, వాళ్ళ మనస్తత్వానికి స్పష్టమైన ప్రతిబింబం. సీత పాత్రలోని అమాయకత్వం, గడుసుతనం, స్వాభిమానం,కొంటెతనం, అక్కసు, అసూయ, ఆడతనం… ని కమలిని చాలా చక్కగా చూపించింది.

రాజీ:
అయోమయానికి, అమాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం- రాజీ పాత్ర. కేవలం గిఫ్టుల్లోనే ప్రేమని చూసే కొంత శాతం అమ్మాయిల ప్రతినిది.

మనసుకి గుచ్చుకున్న సన్నివేశాలు/డైలాగులు:
 
1. శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):ఇప్పుడు ఇష్టాలు భలే మారిపోతాయి కదూ! (పరిపూర్ణమైన 'ప్యూర్ జెలసీ' ని పాటి చూపించే డైలాగ్)
2. శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):'ఇన్నేళ్ళలో నన్ను ఎప్పుడైనా, ఒక్క నిమిషమైనా భర్తగా ఊహిచుకున్నావా?' అని మరదలిని అడిగినప్పుడు … శ్రీ రాం లో మనల్ని ఐడెంటిఫై చేసుకోకుండా ఉండలేము.(ప్రేమ లో మునిగిన వాళ్ళా కి మాత్రమే)
3.బెలూన్ల కుర్రాడికి శ్రీ రాం ఊరికే డబ్బివ్వబోతే ఆ కుర్రాడు 'నేను ముష్టి వాణ్ణి కాదు' అనటం

 - పుల్లట్ల పుల్లమ్మ, తన తమ్ముడికి ఊరికే డబ్బిచ్చిన శ్రీ రాం తో, తన తమ్ముడు ముష్టివాడు కాదని కోప్పడే సీన్

-పుల్లట్ల పుల్లమ్మ తో బెలూన్ల కుర్రాడు 'నేను నీ తమ్ముడు లాంటి వాడినే..ఊరికే నాకూ వొద్దూ' అని వెళ్ళిపోయే సన్నివేశాలలో….చప్పట్లు కొట్టకుండా ఉండలేము.

జూన్ 4, 2006

ఇళయ రాజా

ప్రచురించిన వర్గము తెలుగు పాటలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 2:55 అపరాహ్నం

జూన్ 3, 2006

స్త్రీ పురుష సంభందమూ -చలం- ‘ప్రేమ లేఖలు’ నుంచి

ప్రచురించిన వర్గము చలం — by గుడుంబా శంకర్ (రాజు) @ 5:53 అపరాహ్నం

స్త్రీ పురుష సంభందమూ యిట్లాంటిదే! కావాలని ఆ సంభందాన్ని మురికి అవ్యవాలతో ముడిపెట్టాడి దేవుడు! అంత అందమైన ప్రేమ భావాన్ని, దైవత్వాన్ని రుచి చూసే ఆ మృదు ఆకర్షణకి అంతమూ సాఫల్యమూ అతి నీచం చేసాడు. ఆ సమయాన మనం మనుషలమేనా అనిపించేటట్టు చేశాడు. హృదయం దేవ లోకంలో సంచరిస్తో ఉంటుంది. శరీరం పాతాళంలోకి దిగుతో వుంటుంది. ఆ నరక కూపంలో స్వర్గాన్ననుభవింప జేస్తున్నాడు.

పోనీ యీ గొడవ.

అందరూ సుఖంగానే యే అసహ్యమూ లేకుండా బతుకుతున్నారే యివన్ని తలచుకోకుండా! నా కెందుకీ భాధ!

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

ప్రచురించిన వర్గము నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 5:03 అపరాహ్నం

ఆయన గొప్ప ఋషి. దివ్యదృష్టితో జరగబోయే విషయాలను తెలుసుకోగలడు.తనకు ఆయుష్షు తీరిందని, వచ్చే జన్మలో పందిగా పుడతాడని

తెలుసుకున్నాడాయన. ఏదో జన్మలో చేసిన పాపం కొంచెం మిగిలి ఉండడం వల్ల అలా పుట్టక తప్పదనీ గ్రహించాడు.

ఏం చేయాలి?
శిష్యుడ్ని పిలిచి ఇలా చెప్పాడు.
చూడు శిష్యా, నేను త్వరలో మరణించబోతున్నాను. నువ్వు నాకో సహాయం చేయాలి.
అయ్యో గురువు గారూ, ఎంతటి అమంగళ వార్త చెప్పారు.మీరేం చెప్పినా నేను చేస్తాను. ఆజ్ఞాపించండి.
అక్కడ ఒక పంది కనబడుతోంది చూశావా? దాని నాలుగో పిల్లడిగా నేను పుట్టబోతున్నాను. పుట్టిన వెంటనే కత్తితో పొడిచి

నన్ను చంపెయ్యి.

శిష్యుడికి చాలా దుఃఖమేసింది.కాని ఒప్పుకున్నాడు.
కొద్ది రోజులకే గురువుగారు చనిపోయారు.శిష్యుడు ఆ పందిని కని పెట్టి చూస్తూ ఉన్నాడు.అది ఒక రోజు పిల్లల్ని కంది.గురువుగారు

చెప్పినట్టు నాలుగు పిల్లలే పుట్టాయి. నాలుగో దాని నుదుటిన చిన్న గాటు ఉంటుంటుదని చెప్పాడు గురువు. శిష్యుడు దగ్గరకెళ్ళి

చూశాడు. నిజంగానే గాటు ఉంది.

శిష్యుడికి కర్తవ్యం గుర్తుకొచ్చింది.గురువు కిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కత్తి తీసుకుని దాని దగ్గరికి వెళ్ళాడు. కత్తి

పైఎత్తి వేటు వేసే లోపల ఆ చిన్న పంది పిల్ల ఒక్క అరుపు అరిచింది.

వద్ద్డొద్ద్డు చంపొద్దు అంది.

శిష్యుడు నిర్ఘాంతపోయాడు.

పంది పిల్ల మానవ గొంతుతో మాట్లాడటం అతనికి ఆశ్చర్యం కలిగింది. చేష్టలుడిగి నిలబడిపోయాడు.

దయచేసి నన్ను చంపొద్దు. నాకు పందిలా కూడా బతకాలని ఉంది.నన్ను చంపమని నీకు నేను చెప్పినపుడు పంది జీవితం ఎలా

ఉంటుందో నాకు తెలెయదు. కాని ఇప్పుడు అదీ బాగానే ఉందనిపిస్తోంది.ఇలాగే బతుకుతాను.నన్ను వదిలెయ్యి అంది పందిపిల్ల.

*            *           *              *                 *
పంది జీవితం బాగుండదని చెప్పడానికి మనమెవరం?
అనుభవిస్తే గాని తెలియవేమో కొత్త జీవన సౌందర్యాలు.

*            *           *              *                 *

జంబూక బోధ-స్నేహం గురించి

ప్రచురించిన వర్గము నా రాతలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 4:55 అపరాహ్నం

స్నేహం గురించి ఒకసారి ఒక నక్క ఒకమ్మాయికి మంచి లెక్చర్ ఇచ్చింది. ఆ లెక్చర్లో అది స్నేహాన్ని స్నేహం అనక 'మచ్చిక' అంది. మచ్చిక విధివిధానాలు ఎలా ఉంటాయో అది భలేగా వివరించింది.
'నువ్వు నన్ను మచ్చిక చేసుకున్నావనుకో నేను నీకు, నువ్వు నాకు ప్రత్యేకమైన మనుష్యులుగా లేదా జంతువులుగా ఉండిపోతాం. నీ అడుగుల సవ్వడిని ఎంత మంది మధ్యలో ఉన్నా నేను గుర్తు పట్టగలుగుతాను. నువ్వయినా అంతే, మామూలుగా అయితే రెల్లు పూలు నాకు పెద్దగా నచ్చవుగాని ఇక నుంచి మాత్రం వాటిని చూసినప్పుడల్లా నువ్వు, నీ తెల్లటి చర్మమే గుర్తొస్తాయి నాకు.

ఆ రెల్లు పూల మీంచి వీచే గాలి కూడా మెల్లమెల్లగా నాకు నచ్చడం మొదలవుతుంది. మొదట్లో మనిద్దరం కాస్త దూరందూరంగా కూర్చుని ఒకళ్ళనొకళ్ళం ఊరికే చూసుకుంటూ ఉందాం. మాటలు అపార్ధాలకు మూలం కాబట్టి వీలైనంతవరకు మాట్లాడుకోకుండా ఉందాం. రోజు కొంచెం కొంచెం దగ్గరగా జరిగి కూర్చుంటూ ఉంటే చాలు. సాన్నిహిత్యం దానంతట అదే పెరుగుతుంది.

అన్నట్టు నువ్వు రోజూ ఒకే టైంకి ఇక్కడికి రావాలి. ఉదాహరణకు రోజూ సాయంత్రం ఆరు గంటలకు నువ్వు నన్ను కలవడానికి వస్తున్నవనుకో, ఐదు నుంచే నేను నీ కోసం ఎదురు చూస్తాను. ఆ ఆనందం అప్పట్నించి ఆరయ్యేదాకా క్షణక్షణం పెరుగుతూ పోతుంది. ఆరు దాటితే అది ఉద్వేగంగా, ఆందోళనగా మారి ఆనందం విలువేమిటో తెలుస్తుంది, అలా కాకుండా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడే వచ్చావనుకో నా మనస్సును నీ రాక కోసం ఎప్పుడు సిద్ధం చేసుకోవాలో తెలియక పైన చెప్పిన భావాలన్నీ మిస్ అయిపోతాను.

ఇదంతా సంప్రదాయం. మచ్చిక సంప్రదాయం. ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళం వెళ్ళీపోయామనుకో. అది చూసి నేను ఏడిస్తే ఏడవొచ్చు గాక. కాని నీ గురించి ఎన్ని ఙ్నాపకాలు ఉండిపోతాయి నా దగ్గర్! అలాగే నా గురించి, నా జాతి గురించి నీకెన్ని కొత్త విషయాలు తెలుస్తాయి! అందుకే చెబుతున్నాను మచ్చిక చేసుకోవడం వల్ల లాభాలే కాని నష్టాలు ఏమీ లేవని'

చెప్పింది నక్క కదా అని కొట్టి పారేయొద్దు. అనుభవం నుంచి చెప్పిందేదైనా వినదగ్గదే……

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది