నా రాతలు

జూన్ 24, 2006

ప్రేమ

ప్రచురించిన వర్గము చలం — by గుడుంబా శంకర్ (రాజు) @ 3:11 అపరాహ్నం

శరీర వాంఛ తీర్చుకోవడంతో తృప్తి పడక, నిరంతరమూ ఉన్నతమైన రొమాన్స్ కోసం వెతికే నా హృదయాన్ని చూస్తే నాకు గర్వం. ఈ రుతువుల ఆలింగనానికి కంపించి తపించే ఈ శరీరాన్ని, వీణతంత్రుల కన్న గొప్పగా రమ్యంగా కంపించగల ఈ నరాల్ని చూస్తే గర్వం నాకు.

నేను కావలించుకున్న స్త్రీని నమ్రతతో, కృతజ్ఞతతో పూజిస్తే గాని శాంతించని నా హృదయాన్ని చూస్తే నాకు గర్వంగా, నా స్వభావమే, నా నరాలే, నా హృదయమే, నన్ను కాల్చి బొగ్గు చేస్తాయా, కానీ.ధన్యమౌతుంది నా జీవితం.

ఉన్నతమైనదీ, జీవితాన్నంతా కోరేదీ; మనిషినే, ఆలోచనల్నే, జీవితాల్నే మార్చేసే అధ్భుతమైన ప్రేమని చూస్తే ప్రపంచానికి ఇష్టం లేదు.తాత్కాలికంగా పర స్త్రీలతో సంభందం పురుషుడికి కలిగితే సంఘం tolerate  చేస్తుంది.హర్షిస్తుంది.

అదే గాడమై, అసత్యాన్ని, మోహాన్ని కాల్చగలిగినంత నిర్మలమయిందా, సంఘం శిక్షించి, బలి తీసుకుంటుంది.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

చలం వ్రాసిన 'ప్రేమ లేఖలు' (1922) నుంచి సంగ్రహితం.

నిజంగా మొదటి రెండు పేరాలు చదివినప్పుడల్లా నాకు అనిపిస్తూంటుంది- ఆ రెండు పేరాలు నన్ను,నా ఆలోచనల్ని అద్దం పట్టి చూపిస్తాయి. కాని ఏమి లాభం…చలం ముందు గానే చెప్పినట్టు..సంఘం నన్ను వెలి వేసి శిక్షిస్తూ ఉంది.

ఇంకా వ్యాఖ్యలు లేవు »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది