నా రాతలు

జూన్ 6, 2006

గోదావరి…

ప్రచురించిన వర్గము చిత్ర సమీక్షలు — by గుడుంబా శంకర్ (రాజు) @ 3:53 అపరాహ్నం

శేఖర్ కమ్ముల: నిజంగా గురువు గారు అమ్మాయిల గురించి బాగా స్టడీ చేశినట్లు న్నారు. లేకపోతే ఈ కాలం అమ్మయిల గురించి ఈ మధ్య కాలంలో అంత చక్కగా,కరెక్ట్గా ఎవరూ తెరకెక్కించలేదు.(ఆనంద్ అండ్ గోదావరి…రెండు సినిమాల లోను).పాత్రల మద్య సంఘ్రషణ కాకుండా, పాత్రల మనస్త్వత్వాల మధ్య సంఘర్షణ ని చూపించటంలో శేఖర్ స్క్రీన్-ప్లే నిజంగా అధ్బుతం

శ్రీ రాం:
ఈ తరానికి, పోటీ బ్రతుకు లకి, నిశ్చల నిశ్చితాలకి అందని , అర్ధం కాని…ఉన్నతమైన వ్యక్తిత్వం..ఉన్న పాత్రలో సుమంత్ నిజంగా సరి పోయాడు. నాకే అలా అనిపిస్తోందో..లేకపోతే నిజంగా నిజమేనేమో… ఆ పాత్రకి సుమంత్ తప్ప ఎవరూ నప్పరేమో అనిపిస్తూంది. ఒక వైపు మరదలి ప్రేమ కోసం ఆరాటం..మరొక వైపు సామాజిక స్పృహ ని ఒకే పాత్రలో పోషించిన సుమంత్ నిజంగా అభినందనీయుడు.

సీత: ఈ పాత్ర గురించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎందుకంటే..సీత ప్రతి సినిమాలో పాటల కోసం..గ్లామర్ కోసం కనిపించే మామూలు హీరోయిన్ కాదు. నేటి తరం అమ్మాయిలకి, వాళ్ళ మనస్తత్వానికి స్పష్టమైన ప్రతిబింబం. సీత పాత్రలోని అమాయకత్వం, గడుసుతనం, స్వాభిమానం,కొంటెతనం, అక్కసు, అసూయ, ఆడతనం… ని కమలిని చాలా చక్కగా చూపించింది.

రాజీ:
అయోమయానికి, అమాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం- రాజీ పాత్ర. కేవలం గిఫ్టుల్లోనే ప్రేమని చూసే కొంత శాతం అమ్మాయిల ప్రతినిది.

మనసుకి గుచ్చుకున్న సన్నివేశాలు/డైలాగులు:
 
1. శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):ఇప్పుడు ఇష్టాలు భలే మారిపోతాయి కదూ! (పరిపూర్ణమైన 'ప్యూర్ జెలసీ' ని పాటి చూపించే డైలాగ్)
2. శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):'ఇన్నేళ్ళలో నన్ను ఎప్పుడైనా, ఒక్క నిమిషమైనా భర్తగా ఊహిచుకున్నావా?' అని మరదలిని అడిగినప్పుడు … శ్రీ రాం లో మనల్ని ఐడెంటిఫై చేసుకోకుండా ఉండలేము.(ప్రేమ లో మునిగిన వాళ్ళా కి మాత్రమే)
3.బెలూన్ల కుర్రాడికి శ్రీ రాం ఊరికే డబ్బివ్వబోతే ఆ కుర్రాడు 'నేను ముష్టి వాణ్ణి కాదు' అనటం

 - పుల్లట్ల పుల్లమ్మ, తన తమ్ముడికి ఊరికే డబ్బిచ్చిన శ్రీ రాం తో, తన తమ్ముడు ముష్టివాడు కాదని కోప్పడే సీన్

-పుల్లట్ల పుల్లమ్మ తో బెలూన్ల కుర్రాడు 'నేను నీ తమ్ముడు లాంటి వాడినే..ఊరికే నాకూ వొద్దూ' అని వెళ్ళిపోయే సన్నివేశాలలో….చప్పట్లు కొట్టకుండా ఉండలేము.

వర్డ్ ప్రెస్ . కాం చేత శక్తివంతము చేయబడినది