నా రాతలు

మే 27, 2006

చలం ‘ప్రేమ లేఖలు’ నుంచి..

Filed under: చలం — by Raju Sykam (చి.|| రాజు సైకం ) @ 11:27 సా.

స్రుష్టిదైన విరహ బాధ తన మాధుర్య భారం వల్ల తనే పగిలి, మనిద్దర్నీ

కన్నది. జనన మప్పుడు మాత్రమే ఆ వొక్క ముహూర్తమే మనమైక్యమై వున్నది.

జన్మ మాధుర్యంలో సోలిన మన చేతుల్ని చిరునవ్వుతో విడతీసి, మేఘశయ్యల మీద

ఆనించి ప్రేమ గీతాలు పాడుతూ, నక్షత్ర మార్గాల నూరేగించి, యిద్దరి మధ్యనూ

అగాధమైన వ్యవదిని కల్పించి,ఈ లోకంలో వొదిలారు. నా నోటి నుంచి వచ్చిన మొదటి

శబ్దం, పేరు లేని నీ పేరు. మూర్ఖులు వీళ్ళు. అది పాల కోసం యేడుపనుకున్నారు.

అది మొదలు నేను నీ కోసం వెతుకుతున్నాను. నే నాడుకున్న బొమ్మల్లొ నీ

వున్నావేమోనని వెతికాను. నేను చదువుకున్న పుస్తకాల్లో నీ రూపం

ముద్రించారేమోనని చూసాను. కవులు నీ అందాన్ని పాడారేమోనని చదివాను. నీ

వెక్కడైనా కనబడతావేమోనని మొహాలు వెతుకుతూ, దేశాలు తిరిగాను.

కనపడవు. కాని నాకు నీవు చిరపరిచయవు.నీ రూపమగోచరము, నీ స్వభావము

మనోభావాని కతీతము. కాని నీ కన్న నాకు హ్రుదయానుగత మేదీ లేదు. నీ

నామ మనుస్~ఱుతము.కలలో విన్న గానం వలె ప్రతి నిమిషమూ నా చెవుల ధ్వనిస్తోంది.

నా వేపు నడిచొచ్చే నీ మ్~రుదు పాద రజము అస్తమయ మేఘాలకి రంగు

వేస్తోంది. నన్ను వెతుకుతో వచ్చే నీ అడుగుల చప్పుడు నా హ్~రుదయంలో ప్రతి

నిమిషం ధ్వనిస్తోంది, నా పరమావధి నీవు.

నీ వుండ బట్టి, ఈ ప్రపంచ మింత సుందరమూ, హ్~రుదయాకర్షమూనూ నాకు. కాక

పోతే ఈ కొత్త లోకానికి నాకు సంభందమేమిటి? లోహపు బిళ్ళల్నీ, నీతి ప్రతిష్టల్నీ

ఆరాధించే ఈ ప్రజలతో నాకు సాపత్యమేమిటి? వీరవరో నాకు తెలియదు. నేను వీరి

కర్ధం కాను, నేనిట్లా యెందుకు వెతుకుతున్నానో ఊహించలేరు.

ఒక చోట నీ అధర లావణ్యమూ, ఒక చోట నీ కళ్ళ నలుపూ, యింకొక చోట నీ నడుము

వొంపూ, ఒక చోట నీ వొంటి మెరుపూ, ఒక చోటనీ కంఠము ఇంపూ, మరి ఒక చోట నీ

వక్షము పొంగూ చూసి నీ నించి ప్రేమ లేఖలని స్వీకరిస్తున్నాను, అనుభవిస్తున్నాను,

ఆనందిస్తున్నాను.

ఒక హ్~ఱుదయంలో నీ ప్రణయ మాధుర్యమూ, ఒక హ్~ఱుదయంలో నీ లీలా

వినోదాసక్తీ, ఇంకొక హ్~ఱుదయంలో నీ మాత్~ఱుమార్దవమూ, మరి ఒక హ్~ఱుదయంలో

నీ ఆనంద పారవశ్యతా చూసి ఆకర్షింపబడుతున్నాను, స్వీకరించి

అనుభవిస్తున్నాను. ఆనందిస్తున్నాను.

కాని – నిరాశ, ఇవన్నీ నువ్వెట్లా కాగలవు? వీళ్ళంతా నన్ను నీతి లేని వాణ్ణి అంటున్నారు, చూడు, కాని నాకు భయమెందుకు, దొంగతనమెందుకు నిన్ను ప్రేమించిన నాకు?

నీ వున్నావని, నీ నుంచి విడి పడ్డానని, నీ కోసం వెతక్కుండా వొక్క నిమిశం నిలువలేనని, వీళ్ళ లెఖ్క నాకు రవ్వంతలేదని, నీవు నాకు వార్తలు పంపుతున్నావని, యెక్కడ దేనిని ప్రేమించినా నిన్నేనని, వీళ్ళకేం తెలుసు?

మ్~రుణమైన ఆత్మలు తమో నిర్మితాలైన మేధస్సులు నిన్నూ-నన్నూ అర్దం చేసుకోగలవా ?

చెలం, 1922

1 వ్యాఖ్య »

  1. CHALAM : Love of the Heart. Fire of the Lust..
    Perfectly a Man.. Dying for Women..

    వ్యాఖ్య ద్వారా yassasvi Mahesh — ఫిబ్రవరి 7, 2007 @ 2:01 ఉద. |స్పందించు


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: