నా రాతలు

జూన్ 6, 2006

గోదావరి…

Filed under: చిత్ర సమీక్షలు — by Raju Sykam (చి.|| రాజు సైకం ) @ 3:53 సా.

శేఖర్ కమ్ముల: నిజంగా గురువు గారు అమ్మాయిల గురించి బాగా స్టడీ చేశినట్లు న్నారు. లేకపోతే ఈ కాలం అమ్మయిల గురించి ఈ మధ్య కాలంలో అంత చక్కగా,కరెక్ట్గా ఎవరూ తెరకెక్కించలేదు.(ఆనంద్ అండ్ గోదావరి…రెండు సినిమాల లోను).పాత్రల మద్య సంఘ్రషణ కాకుండా, పాత్రల మనస్త్వత్వాల మధ్య సంఘర్షణ ని చూపించటంలో శేఖర్ స్క్రీన్-ప్లే నిజంగా అధ్బుతం

శ్రీ రాం:
ఈ తరానికి, పోటీ బ్రతుకు లకి, నిశ్చల నిశ్చితాలకి అందని , అర్ధం కాని…ఉన్నతమైన వ్యక్తిత్వం..ఉన్న పాత్రలో సుమంత్ నిజంగా సరి పోయాడు. నాకే అలా అనిపిస్తోందో..లేకపోతే నిజంగా నిజమేనేమో… ఆ పాత్రకి సుమంత్ తప్ప ఎవరూ నప్పరేమో అనిపిస్తూంది. ఒక వైపు మరదలి ప్రేమ కోసం ఆరాటం..మరొక వైపు సామాజిక స్పృహ ని ఒకే పాత్రలో పోషించిన సుమంత్ నిజంగా అభినందనీయుడు.

సీత: ఈ పాత్ర గురించి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎందుకంటే..సీత ప్రతి సినిమాలో పాటల కోసం..గ్లామర్ కోసం కనిపించే మామూలు హీరోయిన్ కాదు. నేటి తరం అమ్మాయిలకి, వాళ్ళ మనస్తత్వానికి స్పష్టమైన ప్రతిబింబం. సీత పాత్రలోని అమాయకత్వం, గడుసుతనం, స్వాభిమానం,కొంటెతనం, అక్కసు, అసూయ, ఆడతనం… ని కమలిని చాలా చక్కగా చూపించింది.

రాజీ:
అయోమయానికి, అమాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం- రాజీ పాత్ర. కేవలం గిఫ్టుల్లోనే ప్రేమని చూసే కొంత శాతం అమ్మాయిల ప్రతినిది.

మనసుకి గుచ్చుకున్న సన్నివేశాలు/డైలాగులు:
 
1. శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):ఇప్పుడు ఇష్టాలు భలే మారిపోతాయి కదూ! (పరిపూర్ణమైన 'ప్యూర్ జెలసీ' ని పాటి చూపించే డైలాగ్)
2. శ్రీ రాం(పెళ్ళీ చూపుల తర్వాత మరదలి తో):'ఇన్నేళ్ళలో నన్ను ఎప్పుడైనా, ఒక్క నిమిషమైనా భర్తగా ఊహిచుకున్నావా?' అని మరదలిని అడిగినప్పుడు … శ్రీ రాం లో మనల్ని ఐడెంటిఫై చేసుకోకుండా ఉండలేము.(ప్రేమ లో మునిగిన వాళ్ళా కి మాత్రమే)
3.బెలూన్ల కుర్రాడికి శ్రీ రాం ఊరికే డబ్బివ్వబోతే ఆ కుర్రాడు 'నేను ముష్టి వాణ్ణి కాదు' అనటం

 – పుల్లట్ల పుల్లమ్మ, తన తమ్ముడికి ఊరికే డబ్బిచ్చిన శ్రీ రాం తో, తన తమ్ముడు ముష్టివాడు కాదని కోప్పడే సీన్

-పుల్లట్ల పుల్లమ్మ తో బెలూన్ల కుర్రాడు 'నేను నీ తమ్ముడు లాంటి వాడినే..ఊరికే నాకూ వొద్దూ' అని వెళ్ళిపోయే సన్నివేశాలలో….చప్పట్లు కొట్టకుండా ఉండలేము.

4 వ్యాఖ్యలు »

 1. నిజమే సినెమాల్లో అమ్మాయి అంటే ట్రైన్ లను విమానాలను సైతం ఏ మత్రం లాజిక్ లేకుండా చేత్తొ ఆపేయగల సదరు హీరో లను విస్మయంగా చూడటం, హీరో ని ప్రేమించదానికె పుట్టాం అన్నట్టు ప్రవర్తించటమె కాని ఒక వ్యక్తిత్వం ఆలోచన ఉన్నట్టు చూపించరు.
  లెకపోతె తనకు జరిగిన అన్యాయం ఎదిరించె విప్లవ నారి పాత్రలు…ఈ రెందు మాత్రమె కాక అమ్మై అంతె ఇలా కూడా ఉంటుంది అని గోదావరి,ఆనంద్ సినెమాల్లో హీరోయిన్ కారక్టర్ ద్వార చూపిన డైరెక్టర్ ని నిజంగా అభినందించాలి.

  వ్యాఖ్య ద్వారా yndvijaya — జూన్ 22, 2006 @ 6:27 సా. |స్పందించు

 2. hmmm….. manchi sameeKsha. keep writing.

  వ్యాఖ్య ద్వారా Sowmya — ఆగస్ట్ 13, 2006 @ 8:44 సా. |స్పందించు

 3. ఈ సినిమా సమీక్ష కొంత భిన్నంగా, క్లుప్తంగా, చాలా బాగా రాశారు. ఇక ముందు కూడా మీకు మంచి చిత్రం అనిపిస్తే దాని సమీక్ష తప్పకుండా రాస్తుండండి.

  వ్యాఖ్య ద్వారా రానారె — డిసెంబర్ 3, 2006 @ 11:25 ఉద. |స్పందించు

 4. ila kaadu, nenu oka saari eenadu aadivaram lo choosanu shekar gaari interview. daanilo chepparu chaala andamgaa godavari chitram samiksha gurnchi.

  వ్యాఖ్య ద్వారా Neelu — మే 20, 2008 @ 7:59 సా. |స్పందించు


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: